ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలి

ABN , First Publish Date - 2021-05-05T08:43:52+05:30 IST

అకాలవర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలి

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి 

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): అకాలవర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పు డు రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు.  ధాన్యం దిగుమ తి చేసుకున్న వెంటనే వివరాలను మిల్లర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. మిల్లర్లు తాలు పేరుతో  ధాన్యం తరుగుతీయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి న రైతులు వేచిచూేస పరిస్థితి లేకుండా కొ నుగోళ్లు జరపాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా వ్యవసాయ, రెవె న్యూ, మార్కెటింగ్‌,  రవాణా, సహకార తదితర విభాగాలతో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.   రాష్ట్ర వ్యాప్తంగా 7,114 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 5,884 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రెండు లక్షల మంది రైతుల వద్ద రూ. 2,920 కోట్ల విలువైన 15.49 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు.

Updated Date - 2021-05-05T08:43:52+05:30 IST