ఇరుజిల్లాల్లో 936 మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2021-04-17T05:58:12+05:30 IST

ఇరుజిల్లాల్లో 936 మందికి కొవిడ్‌

ఇరుజిల్లాల్లో 936 మందికి కొవిడ్‌

ఖమ్మం జిల్లాలో 710, భద్రాద్రి జిల్లాలో 226మందికి పాజిటివ్‌ 

కరోనా లక్షణాలతో ఓ ఆర్‌ఎంపీ మృతి

ఖమ్మంసంక్షేమవిభాగం/కొత్తగూడెం కలెక్టరేట్‌ /సుజాతనగర్‌, ఏప్రిల్‌ 16: ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పదులు, వందలు దాటిన పాజిటివ్‌ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఒక్క రోజే 710మంది కరోనా బారిన పడ్డారని అధికారిక లెక్కలు చెబుతుండగా.. వెలుగులోకి రాని కేసులు ఇంకా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పాజిటివ్‌ కేసులు 200 దాటాయి. శుక్రవారం జిల్లాలో మొత్తం 4,345 మందికి పరీక్షలు చేయగా 226మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌ మండలంలో పది రోజులుగా కరోనా కేసులు పెరుగు తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో సుజాతనగర్‌ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ పుల్లారావు గురువారం రాత్రి అస్వస్థతకు గు  రవడంతో తొలుత కొత్త గూ డెం, పరిస్థితి విషమిం చడంతో

ఖమ్మానికి తరలించి వైద్యం అందించేలోపే మర ణించారు. అయితే ఈ క్రమంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లోఆయనకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో గ్రామస్థులు మరింత ఆందోళన చెందుతు న్నారు.

భద్రాద్రి కలెక్టర్‌కు పాజిటివ్‌

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డికి శుక్ర వారం కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు. శుక్రవారం ఆయ న కరోనా నిర్ధారణ పరీక్ష  చేయించుకోగా పాజిటివ్‌ అని వచ్చిందన్నారు. దీంతో వారం రోజులు తనతో సన్నిహితంగా ఉన్న అధికారులు, ఇతరులంతా అప్ర మత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించు కోవాలని సూచించారు. 

జిల్లాలో 82శాతం వ్యాక్సినేషన్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం 82శాతం మంది వ్యాక్సినేషన్‌ తీసుకొన్నారు. ప్రభుత్వం 5,875 మందికి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యాన్ని నిర్దారిస్తే శుక్రవారం 4,817మంది ఆన్‌లైన్‌లో  తమ పేర్లను నమోదు చేసుకొని 82శాతం మంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకొన్నారు.

Updated Date - 2021-04-17T05:58:12+05:30 IST