కరోనా ఇంజెక్షన్... నల్ల బజారులో

ABN , First Publish Date - 2020-07-08T18:46:21+05:30 IST

రోనా... ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మరి. దీనికి మందును తయారుచేసేందుకు పలు దేశాలు శ్రమిస్తున్న విషయం విదితమే. కొన్ని సంస్థలు... కరోనాను తగ్గించేందుకు తయారుచేసిన ఇంజెక్షన్లను కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు కూడా. అయితే... కాదేదీ మోసానికి అనర్హమన్న రీతిలో... ఈ ఇంజెక్షన్లను కూడా కొందరు ప్రబుద్ధులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు.

కరోనా ఇంజెక్షన్... నల్ల బజారులో

హైదరాబాద్ : కరోనా... ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మరి. దీనికి మందును తయారుచేసేందుకు పలు దేశాలు శ్రమిస్తున్న విషయం విదితమే. కొన్ని సంస్థలు... కరోనాను తగ్గించేందుకు తయారుచేసిన ఇంజెక్షన్లను కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు కూడా. అయితే... కాదేదీ మోసానికి అనర్హమన్న రీతిలో... ఈ ఇంజెక్షన్లను కూడా కొందరు ప్రబుద్ధులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు.


తద్వారా జేబుల్లో దండిగా డబ్బు కుక్కుకుంటున్నారు. కరోనా వైరస్‌ను అంతమొందించే క్రమంలో హెటిరో డ్రగ్స్ సంస్థ... పలు పరిశోధనల అనంతరం ఓ ఇంజెక్షన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ ఇంజెక్షన్‌ను వినియోగించేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది.


ఈ క్రమంలోనే... బ్లాక్‌మార్కెట్‌లో కూడా దీని డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ తతంగానికి సంబంధించిన ఆరోపణలు పెరుగుతుండడంతో... ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు ఈ ఇంజెక్షన్‌లను అమ్మకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించినట్లు సమాచారం. 

Updated Date - 2020-07-08T18:46:21+05:30 IST