Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాదయాత్రకి సంఘీభావం తెలిపిన నేతలపై కేసులు

నెల్లూరు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న మహాపాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన టీడీపీ, బీజేపీ నేతలపై ప్రతి పీఎస్‌లోనూ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదంటూ 41 మందిపై కేసులను పోలీసులు నమోదు చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై 4 కేసులను నమోదు చేశారు. టీడీపీ నేతలు బీదా రవిచంద్ర, అబ్దుల్‌అజీజ్, కురుగొండ్ల రామకృష్ణ, బీజేపీ నేత సత్యకుమార్ సహా 41 మందిపై కేసులు నమోదు అయ్యాయి. 


Advertisement
Advertisement