Abn logo

cauliflower కర్రీ

కావలసిన పదార్థాలు: క్యాలిఫ్లవర్‌ ముక్కలు- మూడు కప్పులు, ఉల్లిగడ్డ, టమోటా ముక్కలు- చెరో కప్పు, జీలకర్ర- స్పూను, గరం మసాలా- స్పూను, కారం, పసుపు- చెరో స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు- ముద్ద, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా క్యాలిఫ్లవర్‌ ముక్కల్ని ఉప్పునీళ్లలో ఉడికించి పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర, కరివే పాకు, పసుపు ఓ నిమిషం వేయించాలి. ఆ తరవాత ఉల్లిముక్కల్ని వేయాలి. కాసేపయ్యాక టమోటా ముక్కలు చేర్చి మెత్తగా అయ్యాక అన్ని పొడులనూ, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పునూ వేసి బాగా కలపాలి. దీంట్లోనే క్యాలిఫ్లవర్‌ ముక్కల్ని కూడా వేసి, కలిపి మూత పెట్టి అయిదు నిమిషాలు ఉడికిస్తే క్యాలిఫ్లవర్‌ కర్రీ రెడీ.

కీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌పనీర్‌ కోఫ్తే కా సలాన్‌షాహీ పనీర్‌మసూర్‌ దాల్‌ కర్రీవంకాయ కొత్తిమీర కారం కూరథాయ్‌ గ్రీన్‌ కర్రీడుబ్కీ వాలే ఆలూషాహీ బిండీ క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా
Advertisement