జీవ శాస్త్ర రంగం లో స్వావలంబనే సి‌సి‌ఎం‌బి లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-16T23:55:41+05:30 IST

కోవిడ్ సంక్షోభ సమయంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతి తక్కువ వ్యయంతో, సత్వరమే, ఖచ్చితమైన ఫలితాలను అందించే కోవిడ్ టెస్ట్ కిట్స్ ను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలాజి

జీవ శాస్త్ర రంగం లో స్వావలంబనే సి‌సి‌ఎం‌బి  లక్ష్యం

హైదరాబాద్: కోవిడ్ సంక్షోభ  సమయంలో స్వదేశీ సాంకేతిక  పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతి తక్కువ వ్యయంతో,  సత్వరమే, ఖచ్చితమైన ఫలితాలను అందించే కోవిడ్ టెస్ట్ కిట్స్ ను సెంటర్  ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలాజి (సిసిఎంబి) అభివృద్ధి పరిచిందని సిఎస్ఐఆర్ -సిసిఎంబి సైన్స్ కమ్యూనికేషన్స్ అండ్ అవుట్ రీచ్ ఆఫీసర్ డా. సోందత్త  కరక్ తెలిపారు.


ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-20 సందర్భంగా పత్రిక సమాచార కార్యలయం, రీజనల్ అవుట్‌రీచ్‌ బ్యూరో సంయుక్తంగా బుధవారం ‘‘శాస్త్ర పరిజ్ఞాన రంగంలో స్వావలంబనకు సిసిఎంబి కృషి’’ ఆనే అంశం పై నిర్వహించిన వెబినార్ లో ప్రధాన వక్త గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  డా. కరక్ మాట్లాడుతూ  కరోన వైరస్ వ్యాప్తి నివారణకు అవసరమైన  మందులు, ప్రక్రియలను, పద్దతులను వివిధ సంస్థలతో కలిసి అభివృద్ధి పరచటంలో సిసిఎంబి కీలక పాత్ర వహించిందని ఆమె పేర్కొన్నారు.


అంతేకాకుండా తమ శాస్త్రవేత్తలు, కరోనాకు సంబంధించిన వివిధ అంశాల పై  వైద్యులు, వైద్య సిబ్బందికి, అవగాహన  కల్పించటమే  కాకుండా , తగిన  శిక్షణ  కూడా ఇచ్చారని తెలిపారు. గత నాలుగు దశాబ్దాల కాలం లో సిసిఎంబి జీవ శాస్త్రానికి సంబంధించి  అనేక రంగాలలో విస్తృత పరిశోధనలు చేపట్టి అద్భుత ఫలితాలను సాధించి, ఈ రంగంలో దేశ స్వావలంబనకు  దోహద పడిందని అన్నారు. 50 మందికి పైగా  అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన శాస్త్రవేత్తలు నిరంతరం అనేక జీవ శాస్త్ర అంశాలపై  పరిశోధనలు తమ సంస్థలో చేస్తుంటారని అన్నారు.


సిసిఎంబి  ఆవిష్కరించిన  జీనోమ్ సీక్వెన్సింగ్, జన్యు సంభందిత వ్యాధుల నివారణకు అవసరమైన నూతన  ఔషధాల ఆవిష్కరణకు, తయారీకి ఉపకరించిందని తెలిపారు. తమ పరిశోధన సంస్థ రూపొందించిన డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ గత కొన్ని సంవత్సరాల కాలం లో అనేక క్లిష్టమైన క్రిమినల్ కేసుల పరిష్కారానికి ఉపయోగ పడిందందని  పేర్కొనారు.ఈ టెక్నాలజీ  అరుదైన జంతువుల పరిరక్షణకు, వేటగాళ్ల బారి నుంచి జంతువులను రక్షించేందుకు, స్మగ్లింగ్ నివారణకు  కూడా ఉపయోగించుకుంటున్నారని  తెలిపారు.




సిసిఎంబి లోవిద్యార్ధులు, యువ శాస్త్రవేత్తలకు  జీవ శాస్త్రానికి సంబంధించిన అంశాలపై అవగాహన, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అటల్ టింకరింగ్  ల్యాబ్స్, స్టార్టప్  సంస్థలను ప్రోత్సహించేందుకు అటల్ ఇంక్యూబిషన్ హబ్ ను కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వివిధ ఔషధ  పరిశ్రమలు, అంకుర సంస్థల తో కలిసి అంటువ్యాధులు, జీవనశాలి వ్యాధులను గుర్తించేందుకు, వాటి నియంత్రణకు అవసరమైన మందులు, వాక్సిన్స్ తయారీకి కృషి చేస్తున్నట్లు తెలిపారు.


అంతే  కాకుండా వ్యక్తుల జన్యుపరమైన లోపాలకు  అనుగుణంగా నూతన ఔషధాల ఆవిష్కరించి భవిష్యత్తు లో సుస్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణానికి  సిసిఎంబి  అవిరళ కృషి చేస్తున్నట్లు డా. కరక్ వివరించారు. అంతకు ముందు  పత్రికా సమాచార కార్యలయం డైరెక్టర్  శృతి పాటిల్ స్వాగతోపన్యాసం లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-20 ముఖ్య  ఉద్దేశ్యాలను గురించి వివరించారు.


Updated Date - 2020-12-16T23:55:41+05:30 IST