Abn logo
Jan 14 2021 @ 11:55AM

హైదరాబాద్: శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు

హైదరాబాద్: నగరంలోని శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతిని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లె పట్నం వచ్చిందా? అనే రీతిలో శిల్పారామంలో అలంకరణలు చేశారు. హరిదాసు సంకీర్తనలు, బుడగ జంగాల ప్రదర్శనలు.. శిల్పారామం కాస్త పల్లెను తలపిస్తోంది. పల్లెంతా పట్నం వచ్చిందా.. అనుకునేలా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతిని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరిదాసులు, పిట్టల దొరలు పర్యాటకులను అలరిస్తున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా శిల్పారామంలో గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది. పట్నంలో ఉన్నా.. పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ హైదరాబాదీలు ఖుషీ అవుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement