బాయిల్డ్‌ రైస్‌కు కేంద్రం సై!

ABN , First Publish Date - 2021-09-18T08:46:20+05:30 IST

యాసంగి సీజన్‌కు సంబంధించిన బాయిల్డ్‌ రైస్‌ స మస్య దాదాపుగా పరిష్కారానికి వచ్చింది.

బాయిల్డ్‌ రైస్‌కు కేంద్రం సై!

  • రాష్ట్రం నుంచి మరో 20 లక్షల టన్నులు
  • సీఎం కేసీఆర్‌ చొరవ.. కేంద్రమంత్రి గోయల్‌కు ఫోన్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌కు సంబంధించిన బాయిల్డ్‌ రైస్‌ స మస్య దాదాపుగా పరిష్కారానికి వచ్చింది. సీఎం కేసీఆర్‌ చొరవతో మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ను రాష్ట్రం నుంచి అదనంగా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ)కు రాష్ట్రం నుంచి ఇచ్చే బియ్యం కో టా 44.75 లక్షల టన్నులకు పెరుగుతుంది. ఆ మేర కు కొన్నాళ్లుగా నెలకొన్న బాయిల్డ్‌ రైస్‌, రా రైస్‌ వి వాదం దాదాపుగా సద్దుమణినట్లవుతుంది. గత యా సంగిలో రైతుల నుంచి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ 92.35 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసింది. సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కోసం ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగించింది. యాసంగి సీజన్‌ కావటంతో రైస్‌మిల్లర్లు బాయిల్డ్‌ రైస్‌నే ఉత్పత్తి చేస్తారు.  ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం యాసంగి సీజన్‌లో 80 శాతం బాయిల్డ్‌ రైస్‌, 20 శాతం రా రైస్‌ తీసుకుంటుంది. 


80 శాతం లెక్క ప్రకారం 50.23 లక్షల టన్ను ల బాయిల్డ్‌ రైస్‌, 12.56 లక్షల టన్నుల రా రాస్‌ను ఎఫ్‌సీఐ తీసుకోవాల్సి ఉంది. కానీ తమ వద్ద బాయి ల్డ్‌ రైస్‌ నిల్వలు విపరీతంగా ఉన్నాయని, కేవలం 24.75 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం లేఖ పంపించింది. దీంతో మిగిలిన 25.48 లక్షల టన్నుల బాయి ల్డ్‌ రైస్‌ను ఏంచేయాలనే ప్రశ్న రాష్ట్రంలో తలెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఽమధ్య లేఖల యుద్ధం నడిచింది. రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, కేటీఆర్‌.. ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను, ఆ శాఖ, ఎఫ్‌సీఐ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించి వచ్చారు. అ యినా ప్రయోజనం లేకుండా పోయింది.  సీఎం చొరవ తీసుకొని పీయూష్‌ గోయల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.  కేసీఆర్‌ స్వయంగా మాట్లాడంతో గోయల్‌ స్పందించారు.  మరో 20 లక్షల టన్నులకు అనుమతిస్తామని గోయల్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

Updated Date - 2021-09-18T08:46:20+05:30 IST