పే ఫిక్సేషన్ గడువు పెంపుతో ఉద్యోగుల సంతృప్తి

ABN , First Publish Date - 2021-05-05T03:22:35+05:30 IST

ప్రభుత్వోద్యోగులకు పే ఫిక్సేషన్ గడువును కేంద్రం పొడిగించనుంది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యింది. వివరాలిలా ఉన్నాయి.

పే ఫిక్సేషన్ గడువు పెంపుతో ఉద్యోగుల సంతృప్తి

న్యూఢిల్లీ : ప్రభుత్వోద్యోగులకు పే ఫిక్సేషన్ గడువును కేంద్రం పొడిగించనుంది. ఈ క్రమంలో  ఆర్థిక శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యింది. వివరాలిలా ఉన్నాయి. పే ఫిక్సేషన్ గుడువను మూడు నెలల పాటు పొడిగించారు. ఏప్రిల్ 15 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో... కేంద్ర ఉద్యోగులకు ఊరట లభించనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో డెడ్‌లైన్ పొడిగించాలని కేంద్రాన్ని ఉద్యోగులు కోరారు. ఈ క్రమంలో మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 


కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం(పే ఫిక్సేషన్ గడువు పొడిగింపు)తో ఉద్యోగులకు పదోన్నతి తేదీ ఆధారంగా స్థిర చెల్లింపు పొందాలా ? లేదా... ఇంక్రిమెంట్ తేదీ ఆధారంగా స్థిర చెల్లింపు పొందాలా ? అన్న ఆప్షన్ ఎంచుకోవడానికి ఎక్కువ గడువు అందుబాటులోకి వచ్చినట్లైంది. మళ్లీ గడువు పొడిగింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.


మరోవైపు, కేంద్ర ప్రభుత్వోద్యోగులకు డీఏ పెంపు జూలై 1 నుంచి అమలులోకి రానుంది. కరోనా నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మూడు వాయిదాల డీఏను పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అన్నింటినీ కలిపి ఒకేసారి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో... ఉద్యోగుల డీఏ ఒకేసారి పెరగనుంది. డీఏ మొత్తంమీద 28 శాతానికి చేరొచ్చని అంచనా. 

Updated Date - 2021-05-05T03:22:35+05:30 IST