Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రూయిజ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం: కిషన్‌రెడ్డి

విశాఖ: దేశంలోని 11 పోర్టుల సమన్వయంతో క్రూయిజ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పోర్టు, టూరిజం శాఖ అధికారులతో నగరంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రూయిస్ టెర్మినల్ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. ఏపీ టూరిజం అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోందన్నారు. విస్తాడోమ్ కోచ్ ప్రత్యేక ట్రైన్‌ను విశాఖకు తీసుకురావాలనేది తన కోరిక అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే దక్షిణ భారతదేశానికి చెందిన టూరిజంపై మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ఈ సమీక్షలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement