Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 19:06PM

కేసీఆర్‌పై కిషన్ రెడ్డి విసుర్లు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు కేంద్రం  ధాన్యం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేకుంటే ఢిల్లీలో రైతులు ఉద్యమం కొనసాగేదా అని ఆయన ప్రశ్నించారు. దేశ సమగ్రతకు ఇబ్బంది కాకూడదనే రైతు చట్టాలను ఉపసంహరించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పుత్రుడు ముఖ్యమంత్రి కాడేమోనన్న భయం సీఎం కేసీఆర్‌ను వెంటాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.


కల్లాలో ఉన్న ధాన్యం సేకరించికుండా  యాసంగి పంట గురించి మాట్లాడుతున్నారన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఏమైయ్యాయన్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. సన్న బియ్యం వేయాలని కేసీఆరే చెప్పి  ఆయనే వద్దంటున్నారన్నారు. 26వేల కోట్లకు పైగా తెలంగాణ బియ్యంపై కేంద్రం ఖర్చుచేస్తోందని ఆయన తెలిపారు. కవులు, కాళాకారులపై తెలంగాణ ప్రభుత్వం నిర్బంధం పెట్టడాన్ని ఖండించారు. సిలిండర్లు పట్టుకుని ప్రచారం చేసినా, హుజురాబాద్ ఉప ఎన్నకల్లో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పలేదన్నారు. 


Advertisement
Advertisement