Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోకాళ్లపై కూర్చుని ఫీల్డింగ్ చేసిన మయాంక్ అగర్వాల్.. తప్పుకాదా?

కాన్పూరు: భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూరులో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ ఈ మ్యాచ్‌పై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత ఆటగాడు మయాంక్ అగర్వాల‌తోపాటు మరో ఇద్దరు మోకాళ్లపై కూర్చుని ఫీల్డింగ్ చేయడమే ఇందుకు కారణం. ఎడ్జ్‌లో క్యాచ్ తీసుకునేందుకు ఇలా మోకాళ్లపై కూర్చోవడాన్ని మంచి అవకాశంగా భావిస్తారు. ఈ మ్యాచ్‌లో ఈ వ్యూహం ఫలించనప్పటికీ మయాంక్‌పై విమర్శలు వెల్తువెత్తాయి. 


అయితే, ఎంసీసీ మాత్రం దీనిని సమర్థించింది. ఎంసీసీ క్రికెట్ సలహాదారు జానీ సింగర్ దీనిపై స్పందిస్తూ ఇదేమంత తప్పుకాదని, ఫీల్డర్ మోకాళ్లపై కూర్చుని ఫీల్డింగ్ చేయడం సరైనదేనని తేల్చి చెప్పారు. ఫీల్డర్ మోకాళ్లపై ఫీల్డింగ్ చేయకుండా నిరోధించడానికి చట్టంలో ఏమీ లేదని జానీ పేర్కొన్నారు. నిజానికి, ఇటీవలి కాలంలో ఇది సర్వసాధారం అయిపోయిందన్నారు. మోకాళ్లపై కూర్చోవడం అన్యాయం కాదని కచ్చితంగా చెప్పగలనని పేర్కొన్నారు.


బంతి వేసిన తర్వాత కదలిక ఉంటేనే దానిని చట్ట విరుద్ధంగా పరిగణిస్తారని జానీ స్పష్టం చేశారు. బంతి ఆడిన తర్వాత ఫీల్డర్ లేచినా, లేదంటే మోకరిల్లినా అప్పుడు మాత్రం 28.6.1 కింద ఉల్లంఘనగా పరిగణిస్తారని, అంపైర్ ఆ నిర్ణయాన్ని తీసుకుంటాడని వివరించారు.  

Advertisement
Advertisement