నువ్వుల బర్ఫీ

కావలసినవి: నువ్వులు - 300గ్రాములు, బెల్లం - 250గ్రాములు, నెయ్యి - 50గ్రాములు, యాలకులు - పది, బాదం పలుకులు - పది.


తయారీ విధానం: యాలకులను పొడి చేసుకోవాలి. బర్ఫీ ట్రేకి నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నువ్వులను వేగించాలి. రెండు మూడు నిమిషాల పాటు వేగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగించకూడదు. తరువాత ఆ నువ్వులను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి కొద్దిగా వేడి అయ్యాక నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత బెల్లం వేయాలి. పావుకప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు చిన్నమంటపై ఉంచాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ ఉండాలి. ఇప్పుడు నువ్వుల పొడి వేసి కలపాలి. యాలకుల పొడి వేయాలి. మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉంచి దింపాలి. నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో పోయాలి. బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి. స్పూన్‌తో బాదం పలుకులను కాస్త ఒత్తితే బర్ఫీకి పట్టుకుంటాయి. పావుగంట తరువాత బర్ఫీని మీకు నచ్చిన సైజులో కట్‌ చేసుకోవాలి. అంతే రుచికరమైన నువ్వుల బర్ఫీలు రెడీ.

క్వినోవా ఖీర్‌లడ్డూలుషీర్‌ కుర్మా డ్రైఫ్రూట్స్‌ కజ్జికాయలురస్‌ మలాయిఖర్బూజ బర్ఫీఖీర్‌డ్రైఫ్రూట్స్‌ లడ్డూగాజర్‌ హల్వాకాజూ బర్ఫీ
Advertisement
Advertisement