ముస్లిం సోదరులకు చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-07-21T01:27:43+05:30 IST

ముస్లిం సోదర సోదరీమణులకు టీడీపీ అధినేత చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, శాంతిజీవనం

ముస్లిం సోదరులకు చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

అమరావతి: ముస్లిం సోదర సోదరీమణులకు టీడీపీ అధినేత చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, శాంతిజీవనం, ప్రేమ, పరమత సహనానికి ప్రతీక బక్రీద్ అని కొనియాడారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారని తెలిపారు. ‘‘కరోనా నుంచి మానవాళిని రక్షించాలని అల్లాను ఫ్రార్ధిద్దాం. అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మీరంతా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా నిభందనలు పాటిస్తూ పండుగను భక్తి, శ్రద్దలతో ఆనందంగా జరుపుకోవాలి’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.



Updated Date - 2021-07-21T01:27:43+05:30 IST