ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా ఉధృతి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-20T01:16:24+05:30 IST

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా ఉధృతి: చంద్రబాబు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా ఉధృతి: చంద్రబాబు

విజయవాడ: ‘కొవిడ్ వ్యాప్తి- ప్రజాప్రతినిధుల బాధ్యత’ అనే అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ప్రజా ప్రతినిధులు అండగా నిలవాలి. వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రపంచంలోనే అత్యధిక కేసులు మన దేశంలో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా ప్రజలందరికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలి. కరోనా కేసుల నమోదులో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 9.6 లక్షల కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్రభుత్వ ప్రణాళికా లోపమే కేసులు పెరుగుదలకు కారణం. కేంద్రం సూచించిన కరోనా నిబంధనలు ఏపీలో అమలు కావడంలేదు. విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది. రాష్ట్రంలో నేటి పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఏపీ ప్రభుత్వం అలసత్వం వీడి కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలి. టీకా ప్రక్రియను వేగవంతం చేసి అందరికీ అందేలా చర్యలు చేపట్టాలి.’’ అని అన్నారు. 


Updated Date - 2021-04-20T01:16:24+05:30 IST