కేసీఆర్ అనబోయి చంద్రబాబు అన్న తెలంగాణ మంత్రి

ABN , First Publish Date - 2021-07-10T21:34:23+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామస్మరణ ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువగా జరుగుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడాలేకుండా ప్రతి పార్టీ చంద్రబాబు

కేసీఆర్ అనబోయి చంద్రబాబు అన్న తెలంగాణ మంత్రి

కరీంనగర్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామస్మరణ ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువగా జరుగుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడాలేకుండా ప్రతి పార్టీ చంద్రబాబు జపం చేస్తోంది. అధికార పార్టీ నాయకులు ఏకంగా తమ అధినాయకుడి పేరు స్థానంలో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తున్నారు. 


తాజాగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆ జాబితాలో చేరారు. జిల్లాలో శనివారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పెన్షన్ల గురించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చివరలో ఇంతమంచి పథకాలు ఇచ్చిన చంద్రబాబుకు దీవెనలు అందించాలా వద్దా.. కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా వద్దా.. అంటూ ప్రజలను ప్రశ్నించారు. అయితే వెంటనే తను చేసిన తప్పును సరిదిద్దుకుని కేసీఆర్ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు పేరు లేకుండా తెలంగాణ, ఆంధ్రా రాజకీయాలు లేవంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2021-07-10T21:34:23+05:30 IST