Advertisement
Advertisement
Abn logo
Advertisement

22న సీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

అమరావతి: ఈ నెల 22న సీమ జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాలలోని టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలతో సహా నెల్లూరులోని పలు ప్రాంతాలు  జలదిగ్భందంలో చిక్కుకున్నాయని తెలిపారు. వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలన్నారు. వరద బాధిత ప్రజలకు ప్రభుత్వం కంటే ముందే సేవలు అందించేందుకు టీడీపీ రంగంలోకి దిగిందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుని టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని చంద్రబాబు సూచించారు.

Advertisement
Advertisement