చెన్నై మెట్రో కొత్త ఐడియా.. హైదరాబాద్‌లో‌నూ అమలు!

ABN , First Publish Date - 2020-05-31T14:27:00+05:30 IST

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులతో భయపడుతున్నారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేత అనంతరం మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

చెన్నై మెట్రో కొత్త ఐడియా.. హైదరాబాద్‌లో‌నూ అమలు!

లిఫ్ట్‌ బటన్లను కాలితో ఆపరేట్‌ చేయొచ్చు

హైదరాబాద్‌ గ్రేటర్‌లోనూ అమలు చేసే యోచన 

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులతో భయపడుతున్నారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేత అనంతరం మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా మెట్రో రైళ్లలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రయాణికులు చేతులు ఉపయోగించకుండా లిఫ్టు బటన్లను వినియోగించే సరికొత్త ఆలోచనను చెన్నైలో ఓ మెట్రోస్టేషన్‌లో అమలు చేశారు. చేతులతో కాకుండా కాలితో లిఫ్ట్‌ బటన్లను ఆపరేట్‌ చేసే పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు. కోయంబేడులోని చెన్నై మెట్రో ప్రధాన కార్యాలయంలో ఈ సదుపాయాన్ని తీసు కొచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Updated Date - 2020-05-31T14:27:00+05:30 IST