Abn logo
Oct 16 2021 @ 18:41PM

ఆ మాట సీఎం జగన్ ఏనాడో చెప్పారు: శ్రీ రంగనాథరాజు

పశ్చిమగోదావరి: చంద్రబాబు తమ ప్రభుత్వంలో వడ్డీ రాయితీ ఇవ్వకుండా ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇచ్చారని మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. చంద్రబాబు ఇంటిస్థలం సెంటున్నర సరిపోదని కోర్టులో కేసు వేశారని, మగవాళ్ళ పేరు మీద ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని కోర్టుకు వెళ్లి ఆపేశారని చెప్పారు. భార్యను కోల్పోయిన భర్తలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడో చెప్పారని గుర్తుచేశారు. 14 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడు ఒక ఎకరం స్థలం కొని ఇళ్ల పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అక్కా చెల్లెమ్మలకు ఏ పథకాలు వెళ్ళకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ విధంగా చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలు ఎవరెవరికి ఓటు వేశారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. 

ఇవి కూడా చదవండిImage Caption