సీమ చికెన్ దమ్ బిర్యానీ (వీడియో)

ABN , First Publish Date - 2020-06-27T20:40:19+05:30 IST

ముందుగా చికెన్ లెగ్‌పీసెస్‌ కడిగి పెట్టుకోవాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొన్ని నూనెలో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని

సీమ చికెన్ దమ్ బిర్యానీ (వీడియో)

తయారీ విధానం: ముందుగా చికెన్ లెగ్‌పీసెస్‌ కడిగి పెట్టుకోవాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొన్ని నూనెలో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కారం పొడి, మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ రసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, యాలకుల పొడి, కొద్దిగా నూనె వేసి ముక్కలకు పట్టుకునేలా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు కూడా వేయాలి. కొద్దిగా వేడి నీళ్లు కూడా పోసి బాగా కలుపుకున్న తర్వాత 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక పెద్ద పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసుకొని మరుగుతున్న నీటిలో బిర్యానికి కావల్సిన మసాలను, సరిపడంత ఉప్పు వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నపుడు ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బియ్యం కొంచెం ఉడికిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమంలో బాస్మతి రైస్‌ను వీడియోలో చూపించిన విధంగా వేయలి. బియ్యంపై నుంచి నెయ్యి, యాలకుల పొడి, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ వేసి గాలి బయటకు వెళ్లకుండా దమ్ పెట్టి 25 నిమిషాలు సన్నని మంటపై ఉడకనివ్వాలి. అంతే నోరూరించే వేడి వేడి దమ్ బిర్యాని సర్వ్ చేసుకోవచ్చు.                                         


Updated Date - 2020-06-27T20:40:19+05:30 IST