అలిపిరి మీదుగా తిరుమలకు వెళ్లిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
ABN , First Publish Date - 2021-06-11T02:01:35+05:30 IST
అలిపిరి మీదుగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు వెళ్లారు. రాత్రి తిరుమలలో ఎన్వీ రమణ బస చేయనున్నారు.
తిరుపతి: అలిపిరి మీదుగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు వెళ్లారు. రాత్రి తిరుమలలో ఎన్వీ రమణ బస చేయనున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన 10వ తేదీన తిరుమలకు వచ్చారు. 11వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
అంతకుముందు తిరుచానూరు అమ్మవారిని ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుచానూరు వెళ్లిన ఎన్వీ రమణ కుటుంబసభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరిగి ప్రయాణమవుతారు.