చైనా, అమెరికాలను కలిపితే...

ABN , First Publish Date - 2021-10-15T22:18:47+05:30 IST

మార్కెట్ పరుగులు తీస్తుంటే ఒకింత ఆందోళన కలగడం సహజం. ఎన్నో సందేహాలు వస్తుంటాయి. గతంలో అనుభవాలు కూడా అంతే ఉన్నాయి. గతేడాది మార్చి నుంచి స్టాక్ మార్కెట్ అసలైన బుల్లిష్ చూపించింది.

చైనా, అమెరికాలను కలిపితే...

న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తుంటే ఒకింత ఆందోళన కలగడం సహజం. ఎన్నో సందేహాలు వస్తుంటాయి. గతంలో అనుభవాలు కూడా అంతే ఉన్నాయి. గతేడాది మార్చి నుంచి స్టాక్ మార్కెట్ అసలైన బుల్లిష్ చూపించింది. మరి ఇది కూడా మరో బుడగేనా ? దీనిని చూసి భయపడాలా ? లేక బుల్లిష్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలా ? అంటే కొందరు నిపుణులు చెబుతున్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ బుల్లిష్ ఆరంభం మాత్రమే అంటున్నారు. ఈ పరుగు మరికొన్ని సంవత్సరాలు ఉంటుందన్నది నిపుణుల వాదన. తక్కువ సమయం ఉండే బుల్లిష్ అంతకన్నా కాదు. ఆర్డినరీ ట్రెండ్ కూడా కాదు. 


ఇటీవల ప్రముఖ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా చెప్పినట్టు ‘హమారా భారత్ కా టైమ్ ఆయేగా నై... టైమ్ ఆగయా’ అని... మన సమయం వచ్చేసింది.మార్కెట్ దూకుడును మరింతగా చూడబోతున్నామని అంటున్నారు. ఆయనే కాదు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ఎనలిస్టులు కూడా అదే అంచనా వేస్తున్నారు. మార్కెట్ గడిచిన ఐదు, పదేళ్లుగా మనం సింగిల్, లో సింగిల్ డిజిట్ గ్రోత్ చూశాం.. కానీ అంతకుమించి ఇక చూడబోతున్నామని అంటున్నారు. ఇది ఇంతటితో ఆగదని,  రానున్న ఐదు, పదేళ్లు మనం మల్టీ ఇయర్ డబుల్ డిజిట్ గ్రోత్ చూస్తామని ధీమా వ్యక్తమవుతోంది. వాస్తవానికి మనం బిగ్గర్ ఎకానమీ వైపుగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతిపెద్ద ఐదో ఆర్ధిక వ్యవస్థగా ఉన్నాం. గత పుష్కరకాలంగా టెక్నాలజీ సాయంతో అమెరికా ఆర్ధికంగా బలపడింది. 


ఇదిలా ఉంటే భారత్‌కు ఇప్పుడు పరిస్థితి సానుకూలంగా మారిందన్న అభిప్రాయాలను ఆర్ధిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టెక్నాలజీ బూమ్ అందుకుంది. అటు అంతర్జాతీయంగా మారిన పరిస్థితులతో  ఉత్పత్తి రంగం పరుగులు తీస్తోంది. మొత్తంగా భారత్ రానున్న పదేళ్ళలో  భారీగా పెట్టుబడులతో పాటు.. కేపిటల్ మార్కెట్ లో ఏసియా రారాజుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు... జనాభా కారణంగా చూసుకుంటే  కన్జూమర్ బిజినెస్ మనకు అదనపు బలం. ఈ క్రమంలో... రానున్న రోజుల్లో భారత్‌కు అధ్బుతమైన భవిష్యత్తు కనపడుతోంది. మూడు ట్రిలియన్ డాలర్ల నుంచి ఐదు ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతున్న భారత్ లో కేపిటల్ మార్కెట్ కూడా అంతే వేగంగా పెరగడం ఖాయమన్న అభిప్రాయాలు వాణిజ్యరంగ నిపుణుల నుంచి వినవస్తున్నాయి. 

Updated Date - 2021-10-15T22:18:47+05:30 IST