Abn logo
Jun 2 2021 @ 04:52AM

‘యువాన్‌’ మారకంపై చైనా ఆంక్షలు

బీజింగ్‌: డాలర్‌తో తన కరెన్సీ ‘యువాన్‌’ మారకం రేటు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి 6.36కి చేరడంపై చైనా ఆందోళన చెందుతోంది. గత నెల రోజుల్లోనే డాలర్‌తో యువాన్‌ మారకకం రేటు 12 శాతం పుంజుకుంది. దీని వల్ల దిగుమతుల భారం తగ్గినా, ఈ పెరుగుదల ఎక్కడ తన ఎగుమతులకు గండి కొడుతుందోనని చైనా భయపడిపోతోంది. ఎగుమతులు పడిపోతే దేశ ఆర్థిక స్థిరత్వానికీ గండి పడుతుందని చైనా భయం. దీన్ని కట్టడి చేసేందుకు చైనా కేంద్ర బ్యాంక్‌ ‘పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా’ రంగంలోకి దిగింది. బ్యాంకులు తమ వద్ద ఉంచాల్సిన విదేశీ మారక ద్రవ్య నిల్వల నిష్పత్తిని 5 నుంచి 7 శాతానికి పెంచింది. దీంతో చైనా బ్యాంకుల వద్ద ఉన్న దాదాపు లక్ష కోట్ల డాలర్ల ఫారెక్స్‌ నిల్వల్లో 2,000 కోట్ల డాలర్లు కేంద్ర బ్యాంక్‌కు చేరతాయి. ఈ చర్యతో యువాన్‌ను ప్రధాన అంతర్జాతీయ కరెన్సీగా చేయాలన్న చైనా ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడతాయని భావిస్తున్నారు.