చైనా టెన్సెంట్...ఈ నెలలో దారుణంగా పడిపోయిన స్టాక్...

ABN , First Publish Date - 2021-07-29T22:53:33+05:30 IST

జూలై నెలలో ఇప్పటివరకు... చైనీస్ టెక్ దిగ్గజం ‘చైనా టెన్సెంట్’ స్టాక్స్ ఏకంగా 23 శాతం క్షీణించాయి.

చైనా టెన్సెంట్...ఈ నెలలో దారుణంగా పడిపోయిన స్టాక్...

న్యూఢిల్లీ : జూలై నెలలో ఇప్పటివరకు... చైనీస్ టెక్ దిగ్గజం ‘చైనా టెన్సెంట్’ స్టాక్స్ ఏకంగా 23 శాతం క్షీణించాయి. ఈ నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ లూసర్‌గా టెన్సెంట్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 170 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ప్రపంచంలోని టాప్ 10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల భారీగా కరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ పది కంపెనీల్లో,,, తొమ్మిది కంపెనీలు చైనాకు చెందినవే ఉండటం గమనార్హం. ఈ కంపెనీల్లో మీటువాన్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ తదితర కంపెనీలు కూడా ఉన్నాయి. బుధవారం వరకు ఈ నెలలో... 23 శాతం పతనమైన టెన్సెంట్ షేర్లు... గురువారం మాత్రం 7.1 శాతం మేర ఎగబాకాయి. ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీపై అణచివేత ఆందోళనలను తగ్గించేందుకు బీజింగ్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో...  టెన్సెంట్ షేర్లు నేడు పెరగడం గమనార్హం.


భారీ పతనం అందుకే... 

డేటా సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ముప్పుగా భావించే దేశంలోని కొన్ని టెక్ దిగ్గజాలను చైనా లక్ష్యంగా చేసుకోవడంతో ఈ ప్రభావం షెన్‌ఝెన్ కేంద్రంగా పని చేస్తోన్న టెన్సెంట్ పై కూడా పడింది. ప్రైవేటు విద్య, రెగ్యులేటరీ నిర్ణయాల ప్రభావం టెన్సెంట్ పై పడి ఈ వారంలో ఈ స్టాక్ దారుణంగా పతనమైంది. దీంతో జూలై నెలలోనే ఏకంగా 170 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ పతనమైంది.


Updated Date - 2021-07-29T22:53:33+05:30 IST