Abn logo
Nov 30 2020 @ 11:43AM

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం: చీరాలలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేశాడు. ఈ దాడిలో భార్య(శివలక్ష్మీ) ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని చీరాల బోస్‎నగర్‎లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో కర్రతో భార్యపై దాడి చేసి..భార్య మృతి చెందిన విషయం తెలుసుకున్న భర్త షాక్ కు గురై.. అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement