Abn logo
Sep 27 2020 @ 01:39AM

నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో మరోసారి నటించనున్న క్రిస్ హెమ్స్‌వార్త్

వాషింగ్టన్: ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌హెడ్’ అనే చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వార్త్ కూడా నటించనున్నాడు. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో వచ్చిన ఎక్స్‌ట్రాక్షన్ చిత్రంలో క్రిస్ హెమ్స్‌వార్త్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతం అయింది. కాగా.. నెట్‌ఫ్లిక్స్ తాజాగా నిర్మిస్తున్న స్పైడర్‌హెడ్ చిత్రంలో క్రిస్ హెమ్స్‌వార్త్‌తో పాటు ప్రముఖ నటులు మైల్స్ టెల్లర్, జర్నీ స్మోలెట్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జార్జ్ శాండర్స్ రచించిన ‘ఎస్కేప్ ఫ్రమ్ స్పైడర్‌హెడ్’ అనే షార్ట్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఖైదీలపై డ్రగ్స్ ప్రయోగాలు నిర్వహించే ప్లాట్‌తో ఈ కథ ఉంటుంది. ఈ చిత్రానికి రెట్ రీస్, పాల్ వెర్నిక్ రచనా సహకారం అందిస్తుండగా.. టాప్ గన్: మేవ్‌రిక్ చిత్రాన్ని తెరకెక్కించిన జోసఫ్ కోసింకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఓవర్సీస్ సినిమామరిన్ని...