భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు

ABN , First Publish Date - 2020-09-24T17:04:52+05:30 IST

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు

కర్నూలు: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని అఖిల ప్రియ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఆయన సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆమెను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు.


మరోవైపు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఓ ప్రజాప్రతినిధి కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ ప్రధాని మోదీకి బైరెడ్డి లేఖ రాశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు బైరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అలాగే మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ఇవాళ అఖిల ప్రియ కర్నూలు లోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారణకు రానున్నారు. తర్వాత బైరెడ్డిని, మరో ముగ్గురిని విచారించనున్నారు.

Updated Date - 2020-09-24T17:04:52+05:30 IST