ఐపీఓకు సిగాచీ ఇండస్ట్రీస్‌

ABN , First Publish Date - 2020-09-30T06:47:39+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేసింది...

ఐపీఓకు సిగాచీ ఇండస్ట్రీస్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేసింది. ఈ ఇష్యూ ద్వారా రూ.60 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువతో కూడిన 28,41,500 షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ఫార్మా పరిశ్రమలో ఫినిష్డ్‌ డోసేజ్‌ కోసం విస్తృతంగా ఉపయోగించే మైక్రోక్రిస్టల్లైన్‌ సెల్యులోస్‌ (ఎంసీసీ)ను సిగాచీ ఇండస్ట్రీస్‌ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోని దహేజ్‌, జగాడియాలో మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాలున్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను గుజరాత్‌లోని ఉత్పత్తి కేంద్రాల విస్తరణకు ఉపయోగించాలని భావిస్తోంది. 

Updated Date - 2020-09-30T06:47:39+05:30 IST