Abn logo
Sep 3 2020 @ 00:00AM

కిచెన్‌ పరిశుభ్రంగా

>
  • తాళింపు వేసేటప్పుడు నూనె జిడ్డు స్టవ్‌ను ఆనుకుని ఉన్న గోడపై  పడుతుంది. దాన్ని సర్ఫ్‌ నీళ్లతో ఏరాజుకారోజు శుభ్రంగా కడిగేసుకోవాలి.
  • వంటింటిలోని కబోర్డులను వంటచేతులతో ముట్టుకుంటుంటాము. నూనెలాంటివి ఉపయోగిస్తూ కబోర్డు తలుపులు తెరుస్తుంటాం. దీనివల్ల అలమారా తలుపుల మీద, నాబ్స్‌ మీద మరకలు పడతాయి. వీటి పై  క్లీనర్‌ని స్ర్పేచేసి తుడిచేస్తే శుభ్రంగా ఉంటాయి.
  • గిన్నెలకు వాడే  స్క్రబ్బర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. అంట్లు తోముకునే స్క్రబ్బర్‌ శుభ్రంగా లేకపోతే అందులో బాక్టీరియా  చేరే అవకాశం ఉంది.
  • తోముకున్న గిన్నెలను కడిగేసిన తర్వాత కొంత సమయం తర్వాత క్లాత్‌ పెట్టి వాటిని పొడిగా తుడుచుకుంటే గిన్నెలపై మరకలు ఉండవు. 
  • సింకు నుంచి కారిన  నీళ్లను చూసుకోకుండా నడిస్తే పడతాం. అందుకే డోర్‌మ్యాట్‌ అక్కడ తప్పనిసరిగా వేయాలి.
  • కూరగాయలు తరిగే చాప్‌బోర్డును కూడా ఎప్పటికప్పుడు కడుక్కోవాలి.. లేకపోతే దీనిపై ఈగలు అవి వాలి అపరిశుభ్రంగా తయారవుతుంది.  
  • కూరగాయలు తరుక్కునే ముందర గట్టుపై కొద్దిగా తడిచేసి దానిపై పాలిథిన్‌ కవర్‌ పెట్టి అందులో బంగాళాదుంప, ఉల్లిపాయ లాంటి కూరల తొక్క పీల్‌చేస్తూ పడేయొచ్చు.  
  • కూరగాయలు, ఇతర చెత్తను డస్ట్‌ బిన్‌లో వేసేటప్పుడు డబ్బా శుభ్రంగా కడిగి తడి  లేకుండా చూసుకోవాలి.   
  • అలాగే మసాలా, డ్రింక్స్‌ వంటివి కొంత మీక్సీ జార్‌లో వదిలేస్తుంటారు అలా చేయకుండా జార్‌లో మిగిలిన దాంట్లో కొంత నీరు పోసి దాన్ని మళ్లీ మిక్సీ పట్టీ మిగతాదానిలో కలపాలి. 

  • ప్రత్యేకంమరిన్ని...