Abn logo
Jan 26 2021 @ 00:17AM

పాఠశాల ఆవరణలో టీఆర్‌ఎస్‌ నాయకుల శ్రమదానం

షాద్‌నగర్‌ అర్బన్‌/కేశంపేట/కొత్తూర్‌: ఫిబ్రవరి ఒకటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు శ్రమదానం చేసి శుభ్రపర్చారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పిలుపు మేరకు పాఠశాల ల ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేశారు. ఎమ్మెల్యే తన స్వగ్రామం ఎక్లా్‌సఖాన్‌పే ట పాఠశాలలో చీపురుతో ఊడ్చారు. శుభ్రత కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ ఇద్రీ్‌షఅహ్మద్‌, గ్రంథాలయ కమిటీ చైర్మన్‌ పి.లక్ష్మీనర్సింహారెడ్డి, సొసైటీ చైర్మన్‌ బక్కన్నయాదవ్‌, వైస్‌చైర్మన్‌ సి.పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు సలేంద్రం రాజేశ్వర్‌, మాధురి నందకిషోర్‌, అంతయ్య, పిల్లి శారదశేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షురాలు శోభాలక్ష్మణ్‌నాయక్‌, కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, వెంకన్నయాదవ్‌, నవీన్‌కుమార్‌, బ్రహ్మచారి, రమే ష్‌, శ్రీనివాస్‌, వేణుగోపాలచారి, సంజీవ్‌కుమార్‌ పాల్గొన్నారు. కొత్తూర్‌ మండల ంలో నాయకులు జడ్పీటీసీ శ్రీలతసత్యనారాయణ, మండల అధ్యక్షుడు పి. యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్‌ భీమయ్య, సర్పంచ్‌లు మామిడి వసుంధర, సంతో ష్‌, ఎంపీటీసీ డి.అంజమ్మ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement