ప్రజల నెత్తిన ‘ధరా’ఘాతం

ABN , First Publish Date - 2021-03-08T05:48:11+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఉప్పు నుంచి పప్పు వరకు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను ఇష్ట మొచ్చిన రీతిలో పెంచి ప్రజల నెత్తిన ధరాఘాతాన్ని మోపాయని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

ప్రజల నెత్తిన ‘ధరా’ఘాతం
పాల్వంచలో భట్టి సైకిల్‌ యాత్ర

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

పాల్వంచ టౌన్‌, మార్చి 7: కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఉప్పు నుంచి పప్పు వరకు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను ఇష్ట మొచ్చిన రీతిలో పెంచి ప్రజల నెత్తిన ధరాఘాతాన్ని మోపాయని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పెరిగిన ధరలను తగ్గించాలని ఆదివారం భద్రాచలం నుంచి ప్రారంభించిన సైకిల్‌ యాత్రలో భాగం గా పాల్వంచకు చేరుకున్నారు. ఆయనకు టీపీసీసీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతూ.... ప్రజలంతా రోడ్డెక్కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల విధానాలపై నినదించాలని పిలుపునిచ్చారు. పేద, బడు గు వర్గాల ప్రజలతోపాటు అన్ని వర్గాల వారు కూడా పెంచి న ధరలతో అతలాకుతలమవుతున్నారని దుయ్యబట్టారు. ఈ నా యాత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని ఈ యాత్రను చేపట్టినట్టు తెలిపారు. ఇది మాయ ప్రభుత్వమని అన్నారు. ఏడు సంవత్సరాల పాలన కాలంలో హామీనిచ్చిన నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలా లేదని, ఒక్క ఉద్యోగావకాశం కల్పించింది లేదన్నారు. కొత్త పెన్షన్‌లు, కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదని, ఇచ్చిన హామీల్లో భాగంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లన్నారు... సింగిల్‌ బెడ్‌ రూమ్‌ కూడా ఇవ్వకుండానే ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి రాములు నాయక్‌ను గెలిపించి ఈ ప్రభుత్వానికి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు సీనియర్‌ నాయకులతోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నాయి.


Updated Date - 2021-03-08T05:48:11+05:30 IST