Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

అమరావతి: రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇదివరకు ఇచ్చిన ఆదేశాలపై పురోగతిని అధికారులు వివరించారు. రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ అదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాలన్నారు.  ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులను సరిదిద్దాలని సూచించారు. రాష్ట్ర విభజన నాటినుంచి దీని గురించి పట్టించుకోలేదన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణకోసం తగినంత సిబ్బంది ఉన్నారా లేదా అన్నదానిపై లెక్కలు తీయాలని అదేశించారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని అధికారులకు జగన్ సూచించారు. Advertisement
Advertisement