ఓట్ల కోసమే జగన్ ఆనాడు ఆ పని చేశారు: దేవినేని

ABN , First Publish Date - 2020-08-11T22:35:27+05:30 IST

ఓట్ల కోసమే జగన్ ఆనాడు ఆ పని చేశారు: దేవినేని

ఓట్ల కోసమే జగన్ ఆనాడు ఆ పని చేశారు: దేవినేని

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రయ్యాక జగన్ మూడు రాజధానుల డ్రామాకు తెరలేపారని దేవినేని మండిపడ్డారు. ఓట్లు దండుకోవడానికే జగన్ ఆనాడు తాడేపల్లిలో రాజప్రాసాదం నిర్మించుకున్నాడని, చంద్రబాబు ప్రభుత్వం రూ.64 వేలకోట్లు సాగునీటి రంగానికి కేటాయించి, పోలవరం ప్రాజెక్టుని 70 శాతం పైగా పూర్తి చేసిందన్నారు. పునాదులు కూడా లేవని పోలవరానికి జగన్ ఎక్కడ గేట్లు పెడుతున్నాడో సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. వంశధార-నాగావళి పనులు జగన్ ప్రభుత్వం ఎందుకు నిలిపేసింది? అని దేవినేని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో పట్టిసీమకు అడ్డుపడిన వారు, నేడు అదే పట్టిసీమపై ఆధారపడటం సిగ్గుచేటన్నారు. పట్టిసీమ ద్వారానే పులివెందులకు చంద్రబాబు నీళ్లిచ్చారని, ఆ ప్రాంత రైతులను అడిగితే ఇదే చెబుతారన్నారు. పేరూరు ప్రాజెక్టు, భైరవాని తిప్ప, గుండ్రేవుల నిర్మాణాలను జగన్ ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-11T22:35:27+05:30 IST