రాష్ట్ర ప్రజలకు సీఎం బతుకమ్మ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-10-14T02:11:49+05:30 IST

పూల పండగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: పూల పండగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదిరోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మనుపేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సహాల నడుమ రాష్ట్ర పండగ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్పూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-10-14T02:11:49+05:30 IST