వ్యాక్సిన్ సంస్థలతో మాట్లాడి, త్వరగా వచ్చేలా చూడండి : సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-05-07T03:02:33+05:30 IST

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశం ముగిసింది.

వ్యాక్సిన్ సంస్థలతో మాట్లాడి, త్వరగా వచ్చేలా చూడండి : సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు, మరణాలు, తీసుకోవాల్సిన అంశాలపై ఇందులో చర్చించారు. అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆక్సిజన్, బెడ్లు, ఇంజక్షన్లు అన్నీ అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఉత్పత్తి సంస్థలతో మాట్లాడి, త్వరితగతిన రాష్ట్రానికి వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ నెల 8 తో నైట్ కర్ఫ్యూ ముగియనుంది. ఈ నేపథ్యంలో వారాంతపు లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


Updated Date - 2021-05-07T03:02:33+05:30 IST