కోడిపందేల్లో రియల్ ఫైట్..

ABN , First Publish Date - 2021-01-14T21:59:41+05:30 IST

కోడిపందేల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెట్టింగ్ డబ్బుల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కోళ్లకు బదులు తాము అన్నట్టుగా పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో..

కోడిపందేల్లో రియల్ ఫైట్..

ఏలూరు: డిప్పకాయలుపాడు కోడిపందేల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెట్టింగ్ డబ్బుల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కోళ్లకు బదులు తాము అన్నట్టుగా పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. అయితే కోడిపందేలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కోడిపందేల దగ్గర పోలీసులు కనిపించకపోవడం విమర్శలు తావిస్తోంది. 


ఇక కృష్ణా జిల్లాలోనూ జోరుగా కోడి పందాలు, బెట్టింగ్స్ పెడుతున్నారు. శిబిరాల దగ్గర ప్రత్యేక బందోబస్తును కోడిపందాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. కోడిపందాలతో పాటు కోత ముక్కాట, గుండాట, జూదం, లోపల-బయట జరుగుతున్నాయి. గతంలో తూర్పు కృష్ణాకే పరిమితమైన కోడి పందాల శిబిరాలు.. ఈ ఏడాది పశ్చిమ కృష్ణాలోనూ శిబిరాలు ఏర్పాటు చేశారు. కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతుల మారుతున్నాయి. కోడి పందేలపై పోలీసులు ఉక్కుపాదం మోపినా.. పందేల జోరు మాత్రం తగ్గలేదు. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు కావడంతో పోలీసులు కూడా చూసీచూడనట్టే వ్యవహరించారు. ఒక్క భోగి రోజే రూ.కోట్లలో పందేలు జరగ్గా, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.  జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గుడివాడ, కైకలూరు, కలిదిండి, పెడన, మచిలీపట్నం, నూజివీడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో భారీగా బరులు ఏర్పడ్డాయి.

Updated Date - 2021-01-14T21:59:41+05:30 IST