వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

ABN , First Publish Date - 2021-01-20T04:22:06+05:30 IST

పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ ఎంవీ రెడ్డి
వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

 అధికారుల పనితీరుపై ఆగ్రహం.. ఓ అధికారికి షోకాజ్‌ జారీకి ఆదేశం

పాల్వంచ టౌన్‌, జనవరి 19: పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సిన్‌ ఈ రోజు చేయాల్సింది ఎంతమందికి, అందులో ఎంత మందికి వ్యాక్సిన్‌ వేశారు.. అంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. దాంతో పొంతనలేని సమాధానం చెప్పిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ సెంటర్స్‌ ఎక్కడికక్కడే నిర్వహించాల్సి ఉండగా, మూ డు సెంటర్లను కలిపి ఇక్కడే నిర్వహించడంపై కూడా సంబంధిత అధికారిని సైతం మందలించారు. జిల్లా ట్రైనింగ్‌ ప్రోగ్రాం అధికారిపై సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం సైతం చెప్పలేని ఆ అధికారికి షోకాజు నోటీసు జారీ చేయా ల్సిందిగా డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌కు అక్కడే ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వ ఆదేశా నుసారం ఈ నెల 22లోపు తొలి విడతగా 44 సెంటర్ల ద్వారా 3,942 మందికి వ్యాక్సిన్‌ను అందజేయాల్సి ఉందన్నారు. నిర్దేశిత రోజువారీ టార్గెట్‌ను అధికారులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గడువు లోపు లక్ష్యం పూర్తిచేయాల్సిం దిగా కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్‌, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, వ్యాక్సిన్‌ ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌, మునిసిపల్‌ కమిషనర్‌ చింత శ్రీకాంత్‌, తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఎంపీడీవో అల్బర్ట్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T04:22:06+05:30 IST