బజాజ్ ఫిన్‌సర్వ్‌... భారీగా క్షీణించిన ఆదాయం

ABN , First Publish Date - 2021-07-22T20:46:09+05:30 IST

కరోనా నేపధ్యంలో బజాజ్ ఫిన్‌సర్వ్ ఆదాయం భారీగా పడిపోయింది.

బజాజ్ ఫిన్‌సర్వ్‌... భారీగా క్షీణించిన ఆదాయం

పూనె : కరోనా నేపధ్యంలో బజాజ్ ఫిన్‌సర్వ్ ఆదాయం భారీగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో దారుణ ఫలితాలను ప్రకటించింది. ఆదాయంలో భారీగా క్షీణత నమోదైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన... తొలి త్రైమాసికంలోలో నికర లాభం 31 శాతం మేర క్షీణించి  రూ. 832.77 కోట్లకు చేరుకుంది. ముందటేడు (2020–21) ఇదే కాలంలో రూ. 1,215 కోట్లు ఆర్జించడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం రూ. 14,192 కోట్ల నుంచి రూ. 13,949 కోట్లకు దిగజారింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అనుబంధ సంస్థలు బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ అలయెంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్, బజాజ్‌ అలయెంజ్‌ లైఫ్‌‌లు ఉమ్మడి పనితీరు ఆధారంగా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.


కాగా... 2020-21 నాల్గవ త్రైమాసికంలో కొంత కోలుకున్నప్పటికీ.. 2021-22 మొదటి త్రైమాసికంలో మాత్రం ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయి, కొవిడ్ సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా వ్యాపించడమే దీనికి కారణం. అనేక రాష్ట్రాలలో లాక్‌డౌన్లు విధించడం, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మోటారు వాహనాల అమ్మకాలు చాలా రాష్ట్రాల్లో ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలో... ‘ఈ త్రైమాసికంలో పరిస్థితులు మరింతగా క్షీణించాయి’ అని బజాజ్ ఫిన్‌సర్వ్ తెలిపింది. అయితే బజాజ్ ఫిన్‌సర్వ్ అనుబంధ సంస్థలల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ నెట్ ప్రాఫిట్ మాత్రం లాభదాయదాయకంగానే ఉంది. బజాజ్ ఫైనాన్స్ నికర లాభం 4 శాతానికి పైగా పెరిగి రూ. 1,002 కోట్లకు చేరింది. ఇక... జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రాఫిట్ 8.4 శాతం క్షీణించి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఇక బజాజ్ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాభం 35 శాతానికి పైగా తగ్గి రూ. 84 కోట్లకు పరిమితమైంది. 

Updated Date - 2021-07-22T20:46:09+05:30 IST