సీడీసీలో టీఆర్‌ఎస్వీ నాయకుల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-03T11:29:24+05:30 IST

హన్మకొండ నయీంనగర్‌లోని చైతన్య డిగ్రీ, పీజీ కళాశాలలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్వీ నాయకులు గురువారం

సీడీసీలో టీఆర్‌ఎస్వీ నాయకుల ఆందోళన

 ఫర్నిచర్‌, కంప్యూటర్ల ధ్వంసం

 విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 


నయింనగర్‌, జూలై 2: హన్మకొండ నయీంనగర్‌లోని చైతన్య డిగ్రీ, పీజీ కళాశాలలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్వీ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సీడీసీ కళాశాలకు చెందిన ఫర్నిచర్‌,  అద్దాలు, పూలకుండీలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వారికి అడ్డుకోబోయిన తమ అధ్యాపకుడు రాజేందర్‌పై దాడి చేసి గాయపరిచినట్లు కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ సీహెచ్‌వీ పురుషోత్తంరెడ్డి విలేరులకు తెలిపారు.


విద్యార్థుల కోసం కష్టపడే విద్యార్థి సంఘాల నాయకులు పోలీసుల ఎదుటే తమ కళాశాలపై దాడి చేయడం విచారకరమన్నారు. తమ కళాశాలలో ఒక్క విద్యార్థి లేకున్నా టీఆర్‌ఎస్వీ నాయకులు తాళాలు పగులగొట్టి కళాశాలలోకి చొరబడి కెమిస్ట్రీ విభాగంలోని ఇద్దరు పరిశోధక విద్యార్థుల లాప్‌టాప్‌లు ధ్వంసం చేశారని తెలిపారు. తమ కళాశాలలో ఎలాంటి ఆన్‌లైన్‌ క్లాసులు, పరీక్షలు నిర్వహించలేదని, ఈ దాడి కేవలం కక్ష సాధింపు చర్యేనని పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి సీడీసీలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2020-07-03T11:29:24+05:30 IST