Abn logo
Aug 2 2020 @ 11:57AM

కరోనా పరీక్షల్లో గందరగోళం

ములుగు జిల్లా: వరంగల్ ఎంజీఎంలో సరైన వైద్యం అందక మృత్యుఘోష కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా టెస్టుల్లో గందరగోళం నెలకొంది. అసలు పరీక్షలు కూడా చేయకుండానే రిపోర్టులు వస్తున్నాయి. ములుగు జిల్లాకు చెందిన మోహన్ ప్రసాద్ కరీంనగర్ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల కరోనా లక్షణాలతో బాధపడుతూ ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష కోసం వెళ్లారు. వివరాలు నమోదు చేసుకున్న సిబ్బంది.. శాంపిల్స్ సేకరణకు మరుసటి రోజు రమ్మని చెప్పారు. అలా నాలుగైదు రోజులు తిరిగినా పలు కారణాలు చెప్పి టెస్టులు చేయకుండానే పంపించారు. ఒక రోజు అతను ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కోవిడ్ నెగిటివ్ అని సెల్ ఫోన్‌కు మెసెజ్ వచ్చింది. దీంతో షాక్ తిన్న బాధితుడు కరోనా టెస్టుల్లో జరుగుతున్న గందరగోళంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సమాచారం ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement