విరుష్కకు శుభాకాంక్షలతో మోతెక్కిపోతున్న సోషల్ మీడియా

ABN , First Publish Date - 2021-01-12T00:25:53+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు పండంటి పాపకు జన్మనిచ్చిన వేళ సోషల్ మీడియా

విరుష్కకు శుభాకాంక్షలతో మోతెక్కిపోతున్న సోషల్ మీడియా

ముంబై: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు పండంటి పాపకు జన్మనిచ్చిన వేళ సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలతో ట్విట్టర్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ మధ్యాహ్నం తమకు పాప జన్మించినట్టు కోహ్లీ ట్వీట్ చేశాడు. అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. కోహ్లీ అలా ట్వీట్ చేశాడో, లేదో... విరుష్కకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 


ఇర్ఫాన్ పఠాన్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, లార్డ్ క్రికెట్ గ్రౌండ్ అధికారిక ట్విట్టర్ ఖాతా, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలెంగ్జాండర్ హార్ట్‌లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్మేట్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-01-12T00:25:53+05:30 IST