Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 25 2021 @ 12:58PM

రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గపోరు

మంచిర్యాల: మంచిర్యాలలో కాంగ్రెస్ వర్గ పోరు రచ్చకెక్కింది. కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ధర్నాకు రాగా.. ఆయనను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు అడ్డుకున్నారు. ప్రేమ్‌సాగర్‌రావు లేకుండా ధర్నాకు ఎలా వచ్చావని నిలదీశారు. కాంగ్రెస్ కోసం వచ్చానని గ్రూపులతో సంబంధం లేదని వీహెచ్ వెల్లడించారు. వీహెచ్‌కు వ్యతిరేకంగా ప్రేమ్ సాగర్ వర్గీయులు, అనుకూలంగా మాజీ మంత్రి వినోద్ వర్గీయుల నినాదాలు చేశారు.


TAGS: congress
Advertisement
Advertisement