బీజేపీ ఒత్తిడికి తలొగ్గే పదవిని వదులుకునేందుకు సిద్ధమైన కేసీఆర్‌: పొన్నాల

ABN , First Publish Date - 2021-01-21T07:18:57+05:30 IST

బీజేపీ ఒత్తిడికి తలొగ్గే కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు

బీజేపీ ఒత్తిడికి తలొగ్గే పదవిని వదులుకునేందుకు సిద్ధమైన కేసీఆర్‌: పొన్నాల

కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత పొన్నాల విమర్శ


బీజేపీ ఒత్తిడికి తలొగ్గే కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అంతే తప్ప.. కొడుకుపై ప్రేమతో కాదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవి నుంచి దిగిపోయాక కూడా కేసులతో బీజేపీ ప్రభుత్వం వేధిస్తే.. సానుభూతి పొందాలన్నది కేసీఆర్‌ ఆలోచన అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భూముల అన్యాక్రాంతంపై సీఎం కేసీఆర్‌ మౌనం వీడాలన్నారు. ఈ విషయాలను దాచిపెట్టడం ద్వారా కబ్జాకోరులను సీఎం ప్రోత్సహిస్తున్నారని, పూజల పేరుతో దేవుళ్లను సైతం మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-01-21T07:18:57+05:30 IST