కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం: రేవంత్ ఆరోపణ

ABN , First Publish Date - 2020-12-04T22:58:48+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి స్పందిస్తూ మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు

కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం: రేవంత్ ఆరోపణ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి స్పందిస్తూ మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మీడియా ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ఓటమికి ఓటర్లు కారణం కాదని.. మీడియానే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు మీడియాను ప్యాకేజీలతో మ్యానేజ్ చేశాయంటూ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రచారం చేశారని చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ జెండా మోసిన కార్యకర్తలను రేవంత్‌ అభినందించారు.

Updated Date - 2020-12-04T22:58:48+05:30 IST