న్యూఢిల్లీ: తనకు కరోనా సోకిన విషయాన్ని వెటరన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఆలస్యంగా బయటపెట్టింది. ఈ నెల మొదట్లో తనకు కొవిడ్ పాజిటివ్‌గా వచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలిపింది. అయితే, తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేకపోవడంతో వేగంగా కోలుకున్నానని చెప్పింది. కానీ, తన కుమారుడు, కుటుంబాన్ని విడిచి కొన్ని రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండడం మాత్రం ఎంతో కష్టమనిపించిందని మీర్జా తెలిపింది. కొవిడ్‌తో ఆటలు కాదు.. జాగ్రత్త అని హెచ్చరించింది.