606 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి

ABN , First Publish Date - 2020-10-21T09:21:59+05:30 IST

తులను సంఘటితం చేయడం, పంటల సాగు-గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై చర్చించుకోవడం కోసం చేపట్టిన రైతు వేదికల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

606 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి

దసరా రోజున ప్రారంభించనున్న కేసీఆర్‌?

553 కోట్లతో మొత్తం 2,601 రైతు వేదికలు

వ్యవసాయ, ఉపాధి హామీ నిధులతో నిర్మాణం


హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రైతులను సంఘటితం చేయడం, పంటల సాగు-గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై చర్చించుకోవడం కోసం చేపట్టిన రైతు వేదికల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 606 రైతు వేదికల నిర్మాణం పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ దసరా రోజున వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా, రూ.553.74 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో మొత్తం 2,601 రైతు వేదికల నిర్మాణం జరుగుతోంది. వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ నిధులతో వీటిని నిర్మిస్తున్నారు. 65 వేదికలు పట్టణ  ప్రాంతాల్లో, 2,536 గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. వీటిల్లో సగటున 56 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.


ఇంకా 1,621 రైతు వేదికలు రూఫ్‌ లెవెల్‌లో, 245 రైతు వేదికలు లెంటల్‌ లెవెల్‌లో, 63 రైతు వేదికలు ఇంకా బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఉన్నాయి. 63 రైతు వేదికలు మినహా మిగతా వాటిని కూడా దసరా నాటికే పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడం వంటి కారణాలతో కొన్ని జాప్యమవుతున్నట్లు చెబుతున్నారు. ఈ పనులన్నీ వేగిరంగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో 19 రైతు వేదికల నిర్మాౄణానికి దాతలు సహకారమందిస్తుౄన్నారు. రైతు వేదికల నిర్మాౄణానికి ఉపాధి హామీ కింద కేటాయించిన నిధుల్లో రూ.100 కోట్లను మంగళవారం విడుదల చేశారు.

Updated Date - 2020-10-21T09:21:59+05:30 IST