కరోనా కట్టడికి సహకరించండి

ABN , First Publish Date - 2021-05-14T05:25:15+05:30 IST

కరోనా కట్టడికి సహకరించండి

కరోనా కట్టడికి సహకరించండి
జాపాలలో గ్రామస్థులతో మాట్లాడుతున్న డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్న సిబ్బంది

మంచాల: కరోనా వైర్‌స కట్టడికి అందరూ సహకరించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివా్‌సరెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం మండలంలోని జాపాలలో కరోనా పాజిటివ్‌ కేసులపై క్షేత్రపరిశీలన చేశారు. జాపాలలో పాజిటివ్‌ పీడితులు 35 మంది ఉండగా వీరికి అందుతున్న వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో కొందరి ఐసోలేషన్‌ పూ ర్తికావచ్చిందని అధికారులు వివరించారు. అనంతరం డీపీవో మాట్లాడుతూ వైరస్‌ మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గాలకు సూచించారు. ఐసోలేషన్‌లో ఉన్నవారు బయటకు రాకుండా చాటింపువేయాలని చెప్పారు. డీఎల్పీవో సంధ్యారాణి, ఈవోఆర్డీ మధుసూదనచారి, సర్పంచ్‌ నౌహీద్‌బేగం, ఉపసర్పంచ్‌ మల్లప్ప, పంచాయ తీ కార్యదర్శి రాజ్‌కుమార్‌, వైధ్యాధికారిని డాక్టర్‌ అరుణతార, ఆశా వర్కర్లు మంజుల, కవిత పాల్గొన్నారు.


  • ఈజీఎస్‌ కూలీలకు మాస్క్‌ల పంపిణీ


ఆమనగల్లు/తలకొండపల్లి: ఉపాధి పని ప్రదేశాల్లో కూలీలు దూరాన్ని పాటించి మాస్క్‌లు ధరించాలని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఎగిరిశెట్టి సత్యం, సర్పంచ్‌ గోదాదేవి కోరా రు. శెట్టిపల్లిలో గురువారం కూలీలకు వారు మాస్క్‌లు పంపిణీ చేశారు. కరోనాపై అవగాహన కల్పించారు. తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో 250 మందికి కూలీలకు మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మాస్క్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్‌ అజీజ్‌, వార్డు సభ్యులు, నాయకులు మణె మ్మ, శోభ, వెంకటయ్య, గిరి, రవి, చంద్రకళ పాల్గొన్నారు. శెట్టిపల్లిలో సర్పంచ్‌ గోదాదేవి ఆధ్వర్యంలో శానిటైజేషన్‌ నిర్వహించారు. అన్ని వీధుల్లో హైపోక్లోరైట్‌ ద్రావకం పిచికారి చేయిం చారు. ఆమనగల్లు మండలం సింగంపల్లి గ్రామంలో సర్పంచ్‌ ప్రేమలత నర్సింహ్మ ఆధ్వర్యంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Updated Date - 2021-05-14T05:25:15+05:30 IST