జపాన్‌లో వినూత్నంగా డిగ్రీల ప్రదానం

ABN , First Publish Date - 2020-04-09T08:08:24+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతా స్థంభించింది. జపాన్‌లోనూ లాక్‌డౌన్‌ అమలవుతోంది. విద్యాసంవత్సరం ఆఖరులో స్నాతకోత్సవాల నిర్వహణకు ఇబ్బందులు తప్ప

జపాన్‌లో వినూత్నంగా డిగ్రీల ప్రదానం

టోక్యో, ఏప్రిల్‌ 8: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతా స్థంభించింది. జపాన్‌లోనూ లాక్‌డౌన్‌ అమలవుతోంది. విద్యాసంవత్సరం ఆఖరులో స్నాతకోత్సవాల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే.. టోక్యోలోని బిజినెస్‌ బ్రేక్‌త్రూ యూనివర్సిటీ.. విద్యార్థుల స్థానంలో రోబోలను ప్రవేశపెట్టి ‘గ్రాడ్యుయేషన్‌ ప్రదానోత్సవం’ ఏర్పాటు చేసింది. ఏఎన్‌ఏ సంస్థ అభివృద్ధి చేసిన ‘న్యూమి’ అనే రోబోలకు విద్యార్థుల మాదిరిగా డ్రెస్‌ వేసి వాటికి అమర్చిన ఐపాడ్లలో విద్యార్థులు వీడియో కాన్ఫరెన్స్‌లో కనిపిస్తుండగా యూనివర్సిటీ అధ్యక్షుడు కెనిచి ఒహామె వారికి డిగ్రీలు ప్రదానం చేశారు.


Updated Date - 2020-04-09T08:08:24+05:30 IST