మరో 12,768 కేసులు

ABN , First Publish Date - 2021-06-03T09:43:18+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 98,048 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,768 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ

మరో 12,768 కేసులు

24 గంటల్లో 98 మంది మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 98,048 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,768 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో 98 మంది చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 17,17,156కి, మరణాల సంఖ్య 11,132కి పెరిగింది. ఒకరోజు వ్యవధిలో 15,612 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 15,62,229కి చేరుకుంది. ప్రస్తుతం 1,43,795 యాక్టివ్‌ కేసులున్నాయి. 


సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్‌ మృతి

సప్తగిరి గ్రామీణ బ్యాంకు (ఎస్‌జీబీ) చైర్మన్‌ మహే్‌షబాబు (52) కొవిడ్‌తో మృతి చెందారు. గత నెల 5న ఆయనతోపాటు భార్య విజయలక్ష్మికి, కుమారుడు శశాంక్‌కు కరోనా సోకింది. తమిళనాడులోని వేలూరులో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయన భార్య, కుమారుడు కోలుకున్నారు. కానీ.. మహే్‌షబాబు మాత్రం కరోనాతో పోరాడుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. 


ఉరిశిక్ష పడిన ఖైదీకి కరోనా 

ఉరిశిక్ష పడిన ఖైదీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. లారీ డ్రైవర్లను హత్య చేసిన కేసులో ప్రకాశం జిల్లా కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో 12 మందికి ఉరిశిక్ష ఖరారైంది. వారు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్నారు. వారిలో ఒకరికి బుధవారం తీవ్రమైన జ్వరం రావడంతో పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2021-06-03T09:43:18+05:30 IST