కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు డిప్యూటీ కలెక్టర్లు

ABN , First Publish Date - 2020-04-09T09:06:18+05:30 IST

కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు డిప్యూటీ కలెక్టర్లు

కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు డిప్యూటీ కలెక్టర్లు

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా(కొవిడ్‌-19) కేసులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సమన్వయం కోసం రాష్ట్ర ప్రధాన కంట్రో ల్‌ రూమ్‌కు 10 మంది డిప్యూటీ కలెక్టర్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగితే  ఆస్పత్రులను సమన్వయపర్చడం, సమస్యలు ఎదురైతే సత్వర పరిష్కారానికి కార్యాచరణ రూ పొందించడం వీరి పని. కరోనా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లతోపాటు ఇతర ల్యాబ్‌ల పర్యవేక్షణకు ఇన్‌చార్జిలుగా ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ సర్కారు మరో ఉత్తర్వు ఇచ్చింది. 


డీజీపీ కార్యాలయంలో సేఫ్‌ టన్నెల్‌ 

కోవిడ్‌-2019 నివారణలో భాగంగా పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే 3వీ సేఫ్‌ టన్నెల్‌ను మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేశారు. ఎస్‌-3వీ వాస్కులర్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు చేసిన ఈ టన్నెల్‌ను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, అడిషనల్‌ డీజీపీ హరీష్‌ కుమార్‌ తదితర ఐపీఎస్‌ అధికారులు పరిశీలించారు.  

Updated Date - 2020-04-09T09:06:18+05:30 IST